Friday, January 22, 2021

కొర్రలు, గుమ్మడి తో కేక్ | పాకశాల - Pakashala

 
కొర్రలు, గుమ్మడి తో కేక్  | పాకశాల - Pakashala

కావాల్సిన పదార్థాలు : 


కొర్రలు - 100 గ్రాములు, 
గుమ్మడిపండు - 300 గ్రాములు, 


పాలు - 300 మి.లీ, 
మైదా - 300 గ్రాములు, 


ఈస్ట్‌ - 4 గ్రాములు, 
పంచదార - 30 గ్రాములు, 



నువ్వులు - అలంకరణకు, 
నెయ్యి - తగినంత.


కిస్‌మిస్‌, 

క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, 

 


తయారుచేసే విధానం : 


 కొర్రలను ఐదు గంటలసేపు నానబెట్టి వడకట్టాలి. 

గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి. 

చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి. 

ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్‌ వేసి ఉండలు లేకుండా కలిపి, ప్లాస్టిక్‌ పేపరు కప్పి పక్కనుంచాలి.

మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి. 

ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి. 

తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి. 

No comments:

Post a Comment