Saturday, September 24, 2022

చికెన్‌ బ్రౌన్‌ రైస్‌ సూప్‌







కావాల్సిన పదార్థాలు:


  • ఉప్పు కలపని చికెన్‌ స్టాక్‌ - 8 కప్పులు
  • ఉల్లిపాయ -1 
  • క్యారెట్లు-3
  • కొత్తిమీర-రెండు కట్టలు
  • నీళ్ళు-2 కప్పులు
  • బ్రౌన్‌ రైస్‌-2 కప్పులు
  • చికెన్‌ ముక్కలు-1/4 కప్పు
  • బిర్యానీ ఆకు-1
  • పాలకూర -1 కట్ట
  • మిరియాలపొడి- 1 టీ స్పూన్‌
  • ఉప్పు- చిటికెడు


తయారుచేసే విధానం:


  • కాస్త మందపాటి గిన్నెలో చికెన్‌ స్టాక్‌ని మరిగించాలి.
  • అందులో ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర వేసి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఎనిమిది నిమిషాలు మరిగించాలి.
  • ఇప్పుడు మిగిలిన చికెన్‌ స్టాక్‌, నీళ్ళు, బియ్యం, చికెన్‌ ముక్కలు, బిర్యానీ ఆకు ఒకదాని తరవాత ఒకటి వేయాలి.
  • మంట తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించాలి.
  • అన్నం, చికెన్‌ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర తరుగు వేయాలి.
  • ఐదు నిమిషాలయ్యాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలిపి సర్వింగ్‌ బౌల్స్‌లో పోసి సర్వ్‌ చేయండి.