కావాల్సిన పదార్థాలు:
బటన్ మష్రూమ్స్- 200గ్రా,
క్యాప్సికమ్- రెండు,
ఉల్లిపాయ- ఒకటి,
అల్లం- అంగుళం ముక్క,
వెల్లుల్లి- ఆరు రెబ్బలు,
నూనె- రెండు టేబుల్ స్పూన్లు,
కారం- టీస్పూను,
సోయాసాస్- రెండు టీస్పూన్లు,
కార్న్‌ఫ్లోర్- టేబుల్‌స్పూన్,
వెనిగర్- టీ స్పూన్,
మంచినీళ్లు- కప్పు,
ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం:
- పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి.
- క్యాప్సికమ్ లోపలి గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి.
- ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి.
- పాన్‌లో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి.
- తరవాత కారం వేసి, అరకప్పు నీళ్లు పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి.
- ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి, తక్కువ మంటమీద ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి.
- తరవాత సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. కాసిని నీళ్లల్లో కలిపిన కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలిపి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉడికించి, దించాలి.