Saturday, September 29, 2018

స్వీట్‌ బన్స్‌




కావలసిన పదార్థాలు: 

బంగాళదుంపలు - 5, 
గిలకొట్టిన గుడ్డు - ఒకటి, 
పాలు - ముప్పావు కప్పు, 
పంచదార - టేబుల్‌ స్పూను, 
మైదా - కప్పు, 
చికెన్‌ ఎసెన్స్‌ (సూపర్‌ మార్కెట్లో దొరుకుతుంది) - టేబుల్‌ స్పూను, 
నూనె - 5 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేసే విధానం: 


  • బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి చిదిమి పెట్టుకోవాలి. 
  • ఒక పాత్రలో పంచదార, పాలు, గిలకొట్టిన గుడ్డు, చికెన్‌ ఎసెన్స్‌ వేయాలి. 
  • పంచదార కరిగాక మైదా, బంగాళదుంపల గుజ్జుని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. 
  • ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి కచోరీలా చేత్తో వత్తి, పెనంపై నూనె వేసి, రెండువైపులా దోరగా వేయించాలి. 
  • వీటిని టమోటా సాస్‌తో తింటే భలే బాగుంటాయి.

No comments:

Post a Comment