సీ ఫిష్ తో వివిధ రకాల వెరైటీ వంటలను వండుతారు. పాంఫ్రెట్ తో వండే ప్రతి ఒక్క వంటా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రోజు మీకు ఒక స్పెషల్ బెంగాలి ఫిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. దీన్ని తయారుచేయడానికి బట్టర్ ఉపయోగించడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అంతే కాదు, దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా త్వరగా తయారవుతుంది. 15శాతం ఫ్యాట్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది. ఇందులో జీరో పర్సెంటేజ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది హార్ట్ పేషంట్స్ కు చాలా మంచిది.
కావల్సిన పదార్థాలు:
తయారుచేయు విధానం:
- పాంఫ్రెట్ ఫిష్(మీడియం సైజ్ ): 3
- పసుపు : 1/2 టీస్పూన్
- బ్లాక్ పెప్పర్ పౌడర్ : 1 టీస్పూన్
- నిమ్మరసం: 1టేబుల్ స్పూన్
- పెరుగు (చిక్కగా లేదా గట్టిగా ఉండాలి):2 టేబుల్ స్పూన్
- కరివేపాకు : 8 రెమ్మలు(సన్నగా కట్ చేసుకోవాలి)
- కొత్తిమీర (సన్నగా కట్ చేసుకోవాలి): 2 టేబుల్ స్పూన్
- కారం(రెడ్ చిల్లీ పౌడర్ ): 2 టీస్పూన్లు
- సోంపు పౌడర్ : 1/2 టీస్పూన్
- బట్టర్ (వెన్న కరగించుకోవాలి): 2
- టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
- ముందుగా పాంఫ్రెట్ ఫిష్ ను క్లీన్ గా శుభ్రం చేసి పెట్టుకోవాలి.
- కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల తేమ పూర్తిగా ఆరిపోతుంది.
- చేపలకు చాకుతో అక్కడక్కడ గాట్లు పెట్టాలి.
- అంతలోపు ఫిష్ కు మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, నిమ్మరసం, పెప్పర్ పౌడర్ మిక్స్ చేయాలి.
- మిక్స్ చేసిన తర్వాత చేపలకు అన్ని వైపులా బాగా పట్టించాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, కారం, సోంపు పౌడర్, కొత్తిమీర తరుగు, కరివేపాకు అన్ని వేసి మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా చేపముక్కలకు పట్టించాలి.
- చేపముక్కలకు పెట్టిన గాట్లలో కొద్దిగా ఈ మసాలా లోపలికి పోయేలా రుద్దాలి.
- ఇలా మ్యారినేట్ చేసిన చేపముక్కలను 1 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
- ఒక గంట తర్వాత చేపముక్కలను బయటకు తీసి, ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, బట్టర్ వేసి కరిగించాలి
- బట్టర్ కరిగిన తర్వాత మ్యారినేట్ చేసిన చేపను పాన్ లో వేసి అన్ని వైపులా బాగా కాలే వరకూ 8 నుండి 10 నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- మీడియం మంట మీద నిధానంగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయడం వల్ల మరీ డ్రైగా మారుతుంది.
- తర్వాత పేపర్ టవల్ మీద ఈ చేప ముక్కలను వేయాలి. ఇలా వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ను పీల్చుకుంటుంది.
- అంతే తవా ఫ్రై క్రిస్పీ పాంఫ్రెట్ రెడీ. పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది వీకెండ్ డిన్నర్ కు ఫర్ఫెక్ట్ కాంబినేషన్.