కావలసిన పదార్థాలు:
- చేపముక్కలు - అర కేజి
- కొబ్బరిపాలు - అర కప్పు
- టమోటా గుజ్జు - 1 కప్పు
- ఉల్లిపాయలు - 4
- అల్లం తరుగు - 1 టీ స్పూను
- వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - గుప్పెడు
- ఆవాలు - 1 టీ స్పూను
- మెంతులు - 1 టీ స్పూను
- పసుపు - పావు టీ స్పూను
- కారం - 2 టీ స్పూన్లు
- దనియాలపొడి - 1 టీ స్పూను
- నీరు - 1 కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
- కడాయిలో ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు (సగం), పసుపు, కారం, దనియాలపొడి ఒకదాని తర్వాత ఒకటి వేగించి, టమోటా గుజ్జు కలపాలి.
- 10 నిమిషాల తర్వాత చేపముక్కలు, నీరు కలిపి ముక్కలు ముప్పావు భాగం ఉడికిన తర్వాత కొబ్బరిపాలు, ఉప్పు వేసి సన్నని మంటపై ఉంచాలి.
- కూర చిక్కబడ్డాక మిగిలిన కరివేపాకు వేసి మూతపెట్టాలి.
No comments:
Post a Comment