Friday, January 22, 2021

కొర్రలు, గుమ్మడి తో కేక్ | పాకశాల - Pakashala

 
కొర్రలు, గుమ్మడి తో కేక్  | పాకశాల - Pakashala

కావాల్సిన పదార్థాలు : 


కొర్రలు - 100 గ్రాములు, 
గుమ్మడిపండు - 300 గ్రాములు, 


పాలు - 300 మి.లీ, 
మైదా - 300 గ్రాములు, 


ఈస్ట్‌ - 4 గ్రాములు, 
పంచదార - 30 గ్రాములు, 



నువ్వులు - అలంకరణకు, 
నెయ్యి - తగినంత.


కిస్‌మిస్‌, 

క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, 

 


తయారుచేసే విధానం : 


 కొర్రలను ఐదు గంటలసేపు నానబెట్టి వడకట్టాలి. 

గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి. 

చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి. 

ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్‌ వేసి ఉండలు లేకుండా కలిపి, ప్లాస్టిక్‌ పేపరు కప్పి పక్కనుంచాలి.

మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి. 

ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి. 

తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి. 

Friday, January 8, 2021

కంద అట్లు తయారు చేయడం | పాకశాల - Pakashala

kanda pachadi  instant dosa recipe  dosa dosa  how to make masala dosa  how to make crispy dosa



 కావాల్సిన పదార్థాలు:


కంద రెండు కప్పులు (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి), 

శనగపప్పు అర కప్పు, 

ఎండుమిర్చి నాలుగు, 

జీలకర్ర టీస్పూను, 

ఉప్పు, నూనె తగినంత.



తయారుచేసే విధానం:


శనగపప్పును అరగంటపాటు నీళ్లలో నానబెట్టాలి.


కంద ముక్కలు మిక్సీలో వేసి, కొబ్బరి తురుములా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.


కంద ముద్దను జల్లెడలో వేసి, నీళ్లన్నీ వడగట్టాలి. ఆ నీళ్లు పక్కనుంచుకోవాలి.


నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పులను కలిపి బరకగా రుబ్బుకోవాలి.


శనగపప్పు, కంద ముద్దలు రెండింటినీ కలుపుకోవాలి.


పెనం మీద నూనె వేసి ఈ మిశ్రమాన్ని గరిటెతో దోశ వేసుకోవాలి.


రెండోవైపు కూడా కాల్చుకున్నాక వేడిగా నెయ్యి, అన్నంతో వడ్డించాలి. ఇది అన్నంలోకి మంచి కాంబినేషన్‌.