Showing posts with label mutton Chukka. Show all posts
Showing posts with label mutton Chukka. Show all posts

Tuesday, February 9, 2021

మటన్‌ చుక్కా

andhra mutton chukka aachi mutton chukka mutton chukka biryani mutton chukka by venkatesh bhat mutton chukka by madras samayal mutton chukka by chef dhamu mutton chukka by revathy shanmugam mutton chukka recipe by chef damodaran mutton chukka recipe by venkatesh bhat



కావాల్సిన పదార్థాలు : 


మటన్‌ - 300 గ్రాములు, 

నూనె లేదా నెయ్యి - 2 టీస్పూన్లు, 

తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1/4 కప్పు, 

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 టీస్పూన్‌, 

ఉప్పు - తగినంత, 

గరం మసాలా (మటన్‌ మసాలా) - టీస్పూన్‌, 

కారం - తగినంత, 

నీరు - 1/4 కప్పు, 

పెరుగు - 2 టీస్పూన్లు. 

పసుపు - తగినంత, 

కరివేపాకు - రెండు రెబ్బలు, 

పచ్చిమిర్చి - రెండు, 

వెల్లుల్లి - ఒక రెబ్బ, 

మిరియాలపొడి - 1/2 టీస్పూన్‌, 

కొత్తిమీర తరుగు - టీస్పూన్‌.



తయారుచేసే విధానం : 

ముందుగా మటన్‌ని శుభ్రంగా కడగాలి. దీన్ని బౌల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు వేసి బాగా కలపాలి. 


మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత తగినంత నీరు పోసి కుక్కర్లో వేసి, మెత్తగా ఉడకబెట్టాలి. 


పాన్‌ తీసుకుని నెయ్యి వేడిచేసి ఇందులో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 


మిరియాల పొడి, మిగిలిన గరం మసాలా వేసి బాగా కలియతిప్పాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మటన్‌ని వేసి సన్నని మంటపై పూర్తిగా ఫ్రై అయ్యే వరకూ ఉంచాలి. 


అంతే వేడివేడి మటన్‌ చుక్కా రెడీ. కొత్తిమీరతో గార్నిష్‌ చేసిన దీన్ని అన్నంలోకానీ రోటీలో కానీ తినొచ్చు