కావాల్సిన పదార్థాలు:
- ఉప్పు కలపని చికెన్ స్టాక్ - 8 కప్పులు
- ఉల్లిపాయ -1
- క్యారెట్లు-3
- కొత్తిమీర-రెండు కట్టలు
- నీళ్ళు-2 కప్పులు
- బ్రౌన్ రైస్-2 కప్పులు
- చికెన్ ముక్కలు-1/4 కప్పు
- బిర్యానీ ఆకు-1
- పాలకూర -1 కట్ట
- మిరియాలపొడి- 1 టీ స్పూన్
- ఉప్పు- చిటికెడు
తయారుచేసే విధానం:
- కాస్త మందపాటి గిన్నెలో చికెన్ స్టాక్‌ని మరిగించాలి.
- అందులో ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఎనిమిది నిమిషాలు మరిగించాలి.
- ఇప్పుడు మిగిలిన చికెన్ స్టాక్, నీళ్ళు, బియ్యం, చికెన్ ముక్కలు, బిర్యానీ ఆకు ఒకదాని తరవాత ఒకటి వేయాలి.
- మంట తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించాలి.
- అన్నం, చికెన్ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర తరుగు వేయాలి.
- ఐదు నిమిషాలయ్యాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలిపి సర్వింగ్ బౌల్స్‌లో పోసి సర్వ్ చేయండి.