పైనాపిల్ కేక్
కావాల్సిన పదార్థాలు :
వెనీలా స్ఫాంజ్‌కేక్- ఒకటి,
పంచదార నీళ్లు- అరకప్పు,
పైనాపిల్ ఎసెన్స్- ఆరు చుక్కలు,
పైనాపిల్ ముక్కలు- నాలుగు,
కేక్ క్రీం- నాలుగు టీ స్పూన్లు,
చెర్రీస్- సరిపడా.
తయారుచేసే విధానం :
స్ఫాంజ్ కేక్ తీసుకుని కింది, పై భాగాలను కట్ చేసుకోవాలి.
తర్వాత కేకుని మూడు పొరలుగా కట్ చేసుకోవాలి.
పంచదార నీళ్లలో పైనాపిల్ ఎసెన్స్ కలుపుకోవాలి.
ఒక్కో పొరపై మూడు టీ స్పూన్ల మిశ్రమాన్ని వేయాలి. తరువాత క్రీం రాయాలి.
వీటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుని శ్యాండ్‌విచ్‌లా చేసుకోవాలి.
ఈ కేకుని మనకి నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని చెర్రీలు, పైనాపిల్ ముక్కలతో అలంకరించి ఓ పావుగంట ఫ్రిజ్‌లో పెట్టి తినాలి.
No comments:
Post a Comment