పైనాపిల్ కేక్
recipes recipe for buckeyes recipes with chicken recipe for banana bread recipes with ground beef recipe for lasagna recipe for meatloaf recipe for eggnog recipes for christmas recipe for chili
Showing posts with label sweet. Show all posts
Showing posts with label sweet. Show all posts
Monday, March 29, 2021
Friday, June 19, 2020
జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala
కావాల్సినవి :
మైదా - 1 కప్పు,
శనగ పిండి - 1 టేబుల్ స్పూన్,
తాజా పెరుగు - 1 కప్పు,
చక్కెర - 1 కప్పు,
నీరు - 4 కప్పులు,
కుంకుమ పువ్వు - 4-5 రేకలు,
ఫ్రూట్ సాల్ట్ - చిటికెడు,
కుంకుమ పువ్వు రంగు - చిటికెడు,
నెయ్యి - 1 కప్పు
తయారీ :
ఒక బౌల్‌లో మైదాపిండి శనగపిండి, తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా గట్టిగా కలపాలి.
కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచాలి.
ఇప్పుడు పొయ్యిమీద మరొక పాన్‌లో పంచదార, నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.
కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ వేసి తక్కువ మంట మీద బాగా కలపాలి. పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి.
ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి. బాటిల్‌లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్‌కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.
పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిమిషాలు వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్‌ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.
జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి. రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి.
బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి. ఇక వేడి వేడి జిలేబీలతో పిల్లల్ని ఊరించండి.. మరి.
బ్రెడ్ జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు-4, పంచదార-అర కప్పు,
మంచినీళ్లు-అర కప్పు,
యాలకుల పొడి-పావు టీస్పూన్,
ఫుడ్ కలర్-చిటికెడు(ఇష్టపడితేనే),
నూనె-తగినంత.
తయారుచేయు విధానం :
బ్రెడ్ ముక్కలను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్ ఆకారంలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో పంచదార వేసి అందులో మంచినీళ్ళు పోసి దాన్ని స్టవ్‌పై పెట్టాలి.
పంచదార కరిగేవరకు గరిటెతో తిప్పుతూ అయిదు నిమిషాలపాటు మరగనివ్వాలి.
తరువాత పంచదార పాకాన్ని కిందికి దించి చల్లారాక అందులో ఫుడ్ కలర్, యాలకుల పొడి కలపాలి.
స్టవ్‌పై బాణలి ఉంచి, తగినంత నూనె పోసి, అది వేడెక్కాక అందులో గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి సన్నటి మంటపై దోరగా వేగించాలి.
వేగిన బ్రెడ్ ముక్కలను పంచదార పాకంలో వేసి, అయిదు నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.
Thursday, June 18, 2020
గోరుమీటీలు తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసినవి:
మైదా - పావుకేజీ,
బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు,
వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు,
పంచదార - 200 గ్రాములు,
బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు,
యాలకులు - రెండు,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు - కొద్దిగా.
తయారీ విధానం:
ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.
పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.
మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
Saturday, May 2, 2020
Sunday, April 26, 2020
సీతాఫలం కలాకంద్ తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసిన పదార్థాలు:
పాలు - రెండు లీటర్లు,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు,
పంచదార - రెండు టీస్పూన్లు,
యాలకుల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు,
సీతాఫలం గుజ్జు - పావు కప్పు,
నెయ్యి - ఒకకప్పు,
పిస్తా - అరకప్పు,
బాదం - ఐదారు పలుకులు.
సిల్వర్ ఫాయిల్ - కొద్దిగా.
తయారీ విధానం:
రెండు పాన్‌లలో పాలను సమానంగా తీసుకోవాలి. ఒక పాన్‌లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి.
తరువాత మరో పాన్‌లో ఉన్న పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి.
దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఒక కాటన్ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్ మిగులుతుంది.
ఈ పన్నీర్‌ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి.
కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి.
ప్లేట్ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. పిస్తా, సిల్వర్ ఫాయిల్‌తో గార్నిష్ చేసుకోవాలి.
తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది.
Saturday, April 11, 2020
వెనిల్లా ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala
కావల్సినవి :
గుడ్లు - నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి),
చక్కెర - పావుకప్పు,
మొక్కజొన్న పిండి - చెంచా
(కొన్ని పాలతో చిక్కగా చేసుకోవాలి), క్రీమ్ - కప్పు,
చిక్కటి పాలు - అరకప్పు, ఉప్పు - చిటికెడు,
వెనిల్లా ఎసెన్స్ - చెంచా
తయారీ :
అడుగు మందంగా ఉండే పాత్రలో పచ్చసొనా, చక్కెర, మిగిలిన పాలూ, మెక్కజొన్న మిశ్రమం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు క్రీమ్ వేసి మరోసారి కలపాలి. ఈ పాత్రను సన్నని మంటపై ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
చిక్కగా అయ్యాక ఉప్పూ, వెనిలా ఎసెన్స్ కలిపి దింపేయాలి.
ఇది బాగా చల్లారాక మరో గిన్నెలోకి తీసుకుని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.
నాలుగైదు గంటలకు గట్టిబడుతుంది. తర్వాత బయటకు తీసి మీకు కావాలనుకుంటే దీనిపై చాక్లెట్ పలుకులు వేసుకోవచ్చు.
తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేయండి.
Thursday, November 21, 2019
చక్కెర పొంగలి తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసినవి :
బియ్యం - ఒక కప్పు,
బెల్లం - ఒకటిన్నర కప్పు,
పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు,
నెయ్యి - పావుకప్పు,
యాలకుల పొడి - పావు టీస్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు,
పచ్చ కర్పూరం పొడి - చిటికెడు,
జాజికాయ పొడి - చిటికెడు,
నీళ్లు - నాలుగు కప్పులు.
తయారీవిధానం :
బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి.
బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి.
అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి.
చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి.
యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి.
నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలిపితే... చక్కెర పొంగలి రెడీ.
Sunday, March 17, 2019
Monday, February 18, 2019
Thursday, November 29, 2018
Andhra Special Poornam boorelu
Poornam boorelu or poornalu are a popular delicacy from Andhra cuisine which is commonly prepared during festivals, wedding and other special occasions. These are called as sukhiyan in malayalam , suyam, suzhiyan or sugunta in other parts of the neighboring states. These are prepared in almost every Telugu speaking home in occassions.
I used old jaggery which is available in ayurvedic stores in India, so it looks very dark. It is believed that old jaggery contains lower amounts of chemical residue that is used during processing.
Monday, October 22, 2018
Saturday, October 20, 2018
Saturday, October 13, 2018
Subscribe to:
Posts (Atom)













