Sunday, December 30, 2018

గోంగూర రొయ్య‌లు




కావల్సినవి 

  • పెద్ద రొయ్యలు-పావుకేజీ
  • గోంగూర-పావుకేజీ
  • ఉప్పు-రెండు టీస్పూన్లు
  • పచ్చిమిర్చి -ఎనిమిది
  • కారం-ఒక టీస్పూను
  • పసుపు-అర టీస్పూను
  • చింతపండు- ఒక టీస్పూను
  • మినపప్పు-ఒక టీస్పూను
  • జీలకర్ర-పావు టీస్పూను
  • ఆవాలు-పావు టీస్పూను
  • వెల్లుల్లి-ఎనిమిది, కరివేపాకు రెండు రెమ్మలు
  • ఎండు మిర్చి-ఒకటి
  • నూనె-మూడు టీస్పూన్లు
  • నీరు-కొద్దిగా

తయారీ : 

  • స్టౌ వెలిగించి కుక్కర్‌ పెట్టి నీరు పోయాలి. 
  • అందులో గోంగూర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, చింతపండు, ఉప్పు వేసి కుక్కర్‌లో నాలుగు లేదా ఐదు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉంచాలి. 
  • తర్వాత దాంట్లో కారం, వేసి మెత్తగా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి.
  • మరో కడాయి పెట్టి నూనె, వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి.
  • దీంట్లో ఉడకబెట్టిన గోంగూర వేసి బాగా కలపాలి.
  • తర్వాత ఉప్పు కారం రుచికి తగినంత వేసుకుని బాగా కలిపి ఉడకనివ్వాలి.
  • అంతే వేడి వేడి గోంగూర రొయ్యలు కూర రెడీ...

No comments:

Post a Comment