Saturday, December 19, 2020

మైసూర్‌ బోండా తయారు చేయడం | పాకశాల - Pakashala

Pakashala మైసూర్‌ బోండా

 


కావాల్సిన పదార్థాలు : 

గోధుమపిండి- కప్పు, 
బియ్యం పిండి- రెండు టీ స్పూన్‌లు (వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి), 
పెరుగు- కప్పు, 
ఉప్పు- రుచికి సరిపడా, 
వంటసోడా - అర టీస్పూన్‌, 
జీలకర్ర- టీ స్పూన్‌, 
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)- టేబుల్‌స్పూన్‌, 
అల్లం (సన్నగా తరిగినవి)- టేబుల్‌ స్పూన్‌, 
కరివేపాకు (సన్నగా తరిగినవి)- టేబుల్‌ స్పూన్‌.


   తయారుచేసే విధానం :

ముందుగా గోధుమపిండిలో అన్ని పదార్థాలను వేసి, నీళ్లు లేకుండానే కలుపుకోవాలి. తర్వాత రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్స్‌ నీళ్లు వేసుకుని, పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఒకవేళ పలుచగా అయితే మరికొంత గోధుమపిండి వేసుకుని, కనీసం రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి.


కలిపిన పిండిని రెండు గంటలపాటు నాననివ్వాలి. ఒకవేళ పుల్లటి పెరుగు వాడి ఉంటే గంట నానితే సరిపోతుంది. మరలా రెండు నిమిషాలు బాగా కలపాలి.


గ్యాస్‌ స్టౌ మీద లోతుగా, దళసరిగా ఉండే పాన్‌ను పెట్టుకొని, డీ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను బాగా తగ్గించుకోవాలి.


బోండా వేసేటప్పుడు నూనె ఎక్కువ  వేడిగా ఉంటే బోండా మద్యలో పిండి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా బోండాను వేసుకోవాలి. తర్వాత మంటను మీడియంలో పెట్టుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత బయటకు తీస్తే సరిపోతుంది. వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్‌ చేసుకుంటే భలే ఉంటాయి



Tags

Mysore bonda recipe

mysore bonda near me

mysore bonda vahchef

mysore bonda calories

No comments:

Post a Comment