Friday, June 19, 2020

జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala






కావాల్సినవి : 



మైదా - 1 కప్పు,
శనగ పిండి - 1 టేబుల్‌ స్పూన్‌, 


తాజా పెరుగు - 1 కప్పు,
చక్కెర - 1 కప్పు, 



నీరు - 4 కప్పులు,

కుంకుమ పువ్వు - 4-5 రేకలు,
ఫ్రూట్‌ సాల్ట్‌ - చిటికెడు, 



కుంకుమ పువ్వు రంగు - చిటికెడు,
నెయ్యి - 1 కప్పు









తయారీ : 








ఒక బౌల్‌లో మైదాపిండి శనగపిండి, తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా గట్టిగా కలపాలి.
కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచాలి. 

ఇప్పుడు పొయ్యిమీద మరొక పాన్‌లో పంచదార, నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. 

కుంకుమ పువ్వు, ఫుడ్‌ కలర్‌ వేసి తక్కువ మంట మీద బాగా కలపాలి. పిండిలో చిటికెడు ఫ్రూట్‌ సాల్ట్‌ కలపాలి. 

ప్లాస్టిక్‌ స్క్వీజ్‌ బాటిల్‌ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి. బాటిల్‌లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్‌కి నాజిల్‌ ఉన్న మూతను పెట్టాలి. 

పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిమిషాలు వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్‌ తీసుకొని బాటిల్‌ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి. 

జిలేబి రౌండ్స్‌ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి. రెండు వైపులా గోల్డ్‌ కలర్‌ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి. 

బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.  ఇక వేడి వేడి జిలేబీలతో పిల్లల్ని ఊరించండి.. మరి.

No comments:

Post a Comment