కావలసినవి :
బియ్యం - ఒక కప్పు,
బెల్లం - ఒకటిన్నర కప్పు,
పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు,
నెయ్యి - పావుకప్పు,
యాలకుల పొడి - పావు టీస్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు,
పచ్చ కర్పూరం పొడి - చిటికెడు,
జాజికాయ పొడి - చిటికెడు,
నీళ్లు - నాలుగు కప్పులు.
తయారీవిధానం :
బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి.
బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి.
అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి.
చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి.
యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి.
నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలిపితే... చక్కెర పొంగలి రెడీ.
కావలసిన పదార్థాలు :
నూడుల్స్- 2 కప్పులు,
చికెన్- పావు కిలో,
సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు- అర కప్పు,
ఉల్లిపాయ- 1,
క్యారెట్- 2,
గుడ్లు- 2,
వేగించిన పల్లీలు- అర కప్పు,
సోయాసాస్- 3 టేబుల్ స్పూన్లు,
వెనిగర్- ఒక టేబుల్ స్పూను,
చిల్లీసాస్- ఒక టేబుల్ స్పూను,
కొత్తిమీర- కొద్దిగా,
నూనె- 2 టేబుల్ స్పూన్లు,
కారం, ఉప్పు- తగినంత.
తయారీ విధానం :
నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి.
చికెన్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె పోసి వేడెక్కాక క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్ వేసి వేగించాలి.
తర్వాత సోయాసాస్, చిల్లీసాస్, వెనిగర్ వేసి నిమిషం పాటు వేగించాలి.
తర్వాత గుడ్లు పగులకొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి మరో అరనిమిషం పాటు వేగించాలి.
ఆ తర్వాత పక్కనపెట్టుకున్న చికెన్, క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి.
చివరగా పల్లీలు వేసి మరో 2 నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి.