Thursday, November 21, 2019

చికెన్‌ పల్లీ నూడుల్స్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala



కావలసిన పదార్థాలు :


నూడుల్స్‌- 2 కప్పులు, 
చికెన్‌- పావు కిలో, 

సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు- అర కప్పు, 
ఉల్లిపాయ- 1, 

క్యారెట్‌- 2, 
గుడ్లు- 2, 

వేగించిన పల్లీలు- అర కప్పు, 
సోయాసాస్‌- 3 టేబుల్‌ స్పూన్లు, 

వెనిగర్‌- ఒక టేబుల్‌ స్పూను, 
చిల్లీసాస్‌- ఒక టేబుల్‌ స్పూను,

కొత్తిమీర- కొద్దిగా,
నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, 
కారం, ఉప్పు- తగినంత.

తయారీ విధానం : 


నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. 
చికెన్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. 
తర్వాత ఒక బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. 
ఆ తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్‌ వేసి వేగించాలి. 
తర్వాత సోయాసాస్‌, చిల్లీసాస్‌, వెనిగర్‌ వేసి నిమిషం పాటు వేగించాలి.
తర్వాత గుడ్లు పగులకొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి మరో అరనిమిషం పాటు వేగించాలి. 
ఆ తర్వాత పక్కనపెట్టుకున్న చికెన్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. 
చివరగా పల్లీలు వేసి మరో 2 నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి.







No comments:

Post a Comment