Monday, April 15, 2019

గోంగూర చికెన్ ఫ్రై


గోంగూర చికెన్ ఫ్రై


కావలసిన పదార్థాలు

గరం మసాలా - పావు టీస్పూను
కరివేపాకు - 2 రెమ్మలు

జీలకర్ర - చిటికెడు
గోంగూర - 1 కప్పు

నూనె - 1 టీస్పూను
నెయ్యి - చికెన్ వేయించటానికి సరిపడా

మారినేషన్ కోసం:
చికెన్ - 300 గ్రా

ఉల్లి ముద్ద - అర కప్పు
నిమ్మరసం - అర టే.స్పూను

నెయ్యి - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
కారం - పావు టీస్పూను

ధనియాల పొడి - పావు టీస్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూను

 తయారు చేయు విధానం

మసాలదినుసులను పట్టించిన చికెన్‌ను అర గంటపాటు పక్కనుంచాలి.
బాండీలో 1 టీస్పూన్ నూనె వేసి గోంగూర వేసి ఉడికేదాకా వేయించి తీయాలి.
ఉడికిన గోంగూరకు పచ్చిమిర్చి చేర్చి మిక్సీలో ముద్ద చేసుకోవాలి.
చికెన్ ముక్కలకు ఉప్పు చేర్చి ఉడకబెట్టుకోవాలి.
బాండీలో నెయ్యి వేసి కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
చికెన్ ముక్కలు, గరం మసాలా వేసి పొడిగా తయారయ్యేవరకూ వేయించాలి.
గోంగూర ముద్ద వేసి చికెన్ ముక్కలకి పట్టి పొడిగా తయారయ్యేవరకూ వేయించుకోవాలి.
ఏమాత్రం తడిలేకుండా పొడి పొడిగా తయారయ్యాక మంట తీసి పేట్‌లోకి తీసుకోవాలి.

No comments:

Post a Comment