Tuesday, April 2, 2019

మెంతికూర క్యారెట్ చట్నీ



మెంతికూర క్యారెట్ చట్నీ

కావలసిన పదార్థాలు

క్యారెట్ ముక్కలు - 2 కప్పులు, 
మెంతి ఆకులు - ఒక కప్పు, 

పచ్చిమిర్చి - 2, 
ఎండుమిర్చి - 4, 

వెల్లుల్లి రెబ్బలు - 4, 
మినప్పప్పు, శనగపప్పు - ఒక టేబుల్ స్పూను చొప్పున, 

ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను చొప్పున, 
నూనె - 2 టీ స్పూన్లు, 

ఉప్పు - రుచికి తగినంత, 
తాలింపు కోసం : నూనె, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ - సరిపడా.

తయారుచేసే విధానం

నూనెలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఒకటి తర్వాత ఒకటి వేగించి పక్కనుంచాలి. 
అదే పాన్లో ఒక స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు పచ్చివాసన పోయేవరకు వేగించి తీసెయ్యాలి. 
తర్వాత మరో అర స్పూను నూనెలో మెంతికూరను 3 నిమిషాల పాటు వేగించాలి. 
అన్నీ చల్లారిన తర్వాత సరిపడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి. 
ఇష్టమైతే పైన నిమ్మరసం పిండుకోవచ్చు.

No comments:

Post a Comment