Monday, April 15, 2019

బ్రెడ్ మంచూరియా


బ్రెడ్ మంచూరియా



కావలసిన పదార్థాలు:

బ్రెడ్ ముక్కలు - ఆరు, 
మొక్కజొన్నపిండి - రెండు టేబుల్ స్పూన్లు

మైదాపిండి - అర టేబుల్ స్పూను
పెప్పర్ - తగినంత

ఉల్లిపాయ - ఒకటి
క్యాప్సికమ్ - ఒకటి

వెల్లుల్లి రేకలు - నాలుగు
అల్లం ముద్ద - ఒక టీ స్పూను

పచ్చిమిరపకాయలు - మూడు
సోయాసాస్ - ఒక టేబుల్ స్పూను

వెనిగర్ - అర టీ స్పూను
కారం - అర టీ స్పూను

అజీనామోటో - పావు టీ స్పూను
రెడ్నా కలర్ - చిటికెడు

పంచదార - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.

తయారు చేయు విధానం

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, మొక్కజొన్నపిండి, పెప్పర్, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. 
పొయ్యిమీద మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి కాగాక బ్రెడ్ ముక్కల్ని పిండిలో ముంచి పెనంపై వేసి సన్నమంటపై వేగించాలి. 
రెండువైపులా ఎర్రగా వేగిన తర్వాత తీసి చిన్నముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక వెల్లుల్లి రేకలు, అల్లంముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగించాలి. 
తర్వాత సోయాసాస్, వెనిగర్, కారం, అజీనామోటో, ఫుడ్కలర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి సన్ననిమంటపై ఉడికించాలి. 
ఇప్పుడు వేగించిన బ్రెడ్ ముక్కల్ని వేసి మరో పదినిమిషాలు వేగించి దించేయాలి.

No comments:

Post a Comment