Saturday, May 2, 2020

క్యారెట్‌ కేక్‌‌ తయారు చేయడం | పాకశాల - Pakashala

 









కావలసినవి : 


క్యారెట్‌ తురుము - 200 గ్రా,
మైదా - 125 గ్రా,
బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను,
బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, 
ఉప్పు - పావు టీ స్పూను,
యాలకులు, దాల్చినచెక్క పొడులు - అర టీ స్పూను చొప్పున,
పంచదార పొడి - 200 గ్రా,
గుడ్లు - 2,
జీడిపప్పు తరుగు - 50 గ్రా,
నూనె - 100 మి.గ్రా.



తయారీ : 


అవెన్‌ 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్‌ చేసిపెట్టుకోవాలి. బేకింగ్‌ ట్రే లోపలి భాగమంతా నూనె రాసి మైదా పొడి చల్లి పక్కనుంచాలి. 
వెడల్పాటి లోతైన గిన్నెలో గుడ్లు గిలకొట్టి నూనె, మైదా, బేకింగ్‌ పౌడర్‌, సోడా, ఉప్పు, పంచదార పొడి, యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, జీడిపప్పు ముక్కలు, క్యారెట్‌ తురుము ఒకటి తర్వాత ఒకటి వేస్తూ బాగా కలపాలి. 
ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ ట్రేలో పోసి 25 నుంచి 30 నిమిషాల పాటు అవెన్‌లో ఉంచాలి. 
కేక్‌ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ముక్కలు కోసుకోవాలి. జీడిపప్పు బదులు వాల్‌నట్‌ ముక్కలు కూడా వాడుకోవచ్చు.

No comments:

Post a Comment