Sunday, April 26, 2020

సీతాఫలం కలాకంద్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసిన పదార్థాలు: 







పాలు - రెండు లీటర్లు,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు,
పంచదార - రెండు టీస్పూన్లు,
యాలకుల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు,
సీతాఫలం గుజ్జు - పావు కప్పు,
నెయ్యి - ఒకకప్పు,
పిస్తా - అరకప్పు,
బాదం - ఐదారు పలుకులు.
సిల్వర్‌ ఫాయిల్‌ - కొద్దిగా.     


తయారీ విధానం: 







రెండు పాన్‌లలో పాలను సమానంగా తీసుకోవాలి. ఒక పాన్‌లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. 


తరువాత మరో పాన్‌లో ఉన్న పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి.
దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి ఒక కాటన్‌ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్‌ మిగులుతుంది. 


ఈ పన్నీర్‌ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి.
కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి. 


ప్లేట్‌ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. పిస్తా, సిల్వర్‌ ఫాయిల్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.
తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. 

No comments:

Post a Comment