Sunday, April 26, 2020

సీతాఫలం కలాకంద్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసిన పదార్థాలు: 







పాలు - రెండు లీటర్లు,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు,
పంచదార - రెండు టీస్పూన్లు,
యాలకుల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు,
సీతాఫలం గుజ్జు - పావు కప్పు,
నెయ్యి - ఒకకప్పు,
పిస్తా - అరకప్పు,
బాదం - ఐదారు పలుకులు.
సిల్వర్‌ ఫాయిల్‌ - కొద్దిగా.     


తయారీ విధానం: 







రెండు పాన్‌లలో పాలను సమానంగా తీసుకోవాలి. ఒక పాన్‌లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. 


తరువాత మరో పాన్‌లో ఉన్న పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి.
దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి ఒక కాటన్‌ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్‌ మిగులుతుంది. 


ఈ పన్నీర్‌ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి.
కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి. 


ప్లేట్‌ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. పిస్తా, సిల్వర్‌ ఫాయిల్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.
తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. 

క్యారెట్ ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala





కావాల్సినవి :




క్యారెట్‌ జ్యూస్‌ - రెండు కప్పులు,
పాలు - రెండు కప్పులు,
చక్కెర - రెండు కప్పులు,
క్రీమ్‌ - ఒక కప్పు,
బాదం, పిస్తాలు - అరకప్పు,
మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు






తయారీ :




పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. కొద్ది పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాలలో వేసి కలపాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్‌ వేసి కలపాలి. 

పది నిమిషాలు మరిగాక క్యారెట్‌ జ్యూస్‌ వేసి కలపాలి. మిశ్రమం మరింత చిక్కగా అయ్యేవరకు మరిగించి దించేసుకోవాలి.



చల్లారాక డీప్‌ ఫ్రీజ్‌లో పెట్టాలి. ఒక గంట తరువాత తీసి మిక్సీలో బాగా బ్లెండ్‌ చెయ్యాలి.
దీనివల్ల ఐస్‌క్రీం మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. బ్లెండ్‌ చేశాక దీనిపై బాదం, పిస్తాలను అలకరించుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.



గట్టిబడిన తరువాత ఇక ఆలస్యం చేయకుండా ఆరగించండి.