కావలసిన పదార్థాలు
క్యాబేజీ- సగభాగం,
వేరుసెనగ పప్పు- పావు కప్పు,
ఎండు మిరపకాయలు- 3,
మినపపప్పు- 1 చెంచా,
సెనగపప్పు- 1 చెంచా,
ఇంగువ- అర చెంచా,
ఉప్పు- తగినంత,
నూనె- కొంచెం,
ఆవాలు- అర చెంచా,
కరివేపాకు- కొంచెం.
తయారు చేయు విధానం
రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడిచేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి.
తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి.
వీటిని చల్లార్చి కొద్దిగా నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.
అది వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి.
ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ వాసన గిట్టని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.
No comments:
Post a Comment