recipes
recipe for buckeyes
recipes with chicken
recipe for banana bread
recipes with ground beef
recipe for lasagna
recipe for meatloaf
recipe for eggnog
recipes for christmas
recipe for chili
బియ్యం - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - పావుకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్, జీడిపప్పు - పది పలుకులు, ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చ కర్పూరం పొడి - చిటికెడు, జాజికాయ పొడి - చిటికెడు, నీళ్లు - నాలుగు కప్పులు.
తయారీవిధానం :
బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి. అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి. యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలిపితే... చక్కెర పొంగలి రెడీ.
నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. చికెన్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె పోసి వేడెక్కాక క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్ వేసి వేగించాలి. తర్వాత సోయాసాస్, చిల్లీసాస్, వెనిగర్ వేసి నిమిషం పాటు వేగించాలి. తర్వాత గుడ్లు పగులకొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి మరో అరనిమిషం పాటు వేగించాలి. ఆ తర్వాత పక్కనపెట్టుకున్న చికెన్, క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. చివరగా పల్లీలు వేసి మరో 2 నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి.
కోడిగుడ్లను ఉడికించి పెంకుతీసి కొంచెం పెద్దసైజుముక్కలుగా కట్ చేయాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, కాప్సికం, టమాటాలను కూడా పెద్దసైజు (సుమారు అంగుళం సైజు) ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత కాప్సికం ముక్కలు వేసి కొంచెం మెత్తబడేవరకు వేసి టమాట ముక్కలు వేయాలి. ఇవన్నీ కలుపుతూ అజినోమోటో, సోయాసాస్, టమాటాసాస్, చిల్లీసాస్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత గుడ్డు ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి వేసి కొద్దిసేపు వేసి కొత్తిమీర చల్లి దింపేయాలి. అలాగే స్నాక్‌లా సర్వ్ చేయొచ్చు. లేదా నూడుల్స్, ఫ్రైడ్‌రైస్‌తో కలిపి సర్వ్ చేయొచ్చు.
కుంకుమపువ్వు -కొంచెం, పోళీ చేసేందుకు కావలసినవి మైదాపిండి-రెండు కప్పులు సోడా, ఉప్పు, నూనె-కొద్డిగా
తయారుచేసే విధానం : పాలను తక్కువవేడిలో పెట్టి బాగా కాయాలి. బాదం, జీడిపప్పులను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి లిక్విడ్‌గా చేసుకోవాలి. పాలు బాగా సగానికి సగం తగ్గిన తర్వాత దాంట్లో చక్కెర, బాదం జీడిపప్పుల లిక్విడ్, యాలకులపొడి అన్నీవేసి కలపాలి. వెడల్పైన పాత్రలో పోసి బాగా ఆరనీయాలి. తర్వాత మైదాపిండితో చిన్న చిన్న పూరీలు చేసి, పాలలో వేయాలి. 5నిమిషాల తర్వాత పాలలో ఊరిన పూరీలను తీసి, ఒక ప్లేట్లో వేసి దానిపై కొంచెం చక్కెరపొడి చల్లి, కుంకుమపువ్ఞ్వతో అలంకరించి సర్వ్ చేయాలి. చాలా రుచికరమైన బొబ్బట్లు ఇవి.