పైనాపిల్ కేక్
recipes recipe for buckeyes recipes with chicken recipe for banana bread recipes with ground beef recipe for lasagna recipe for meatloaf recipe for eggnog recipes for christmas recipe for chili
Monday, March 29, 2021
Tuesday, February 9, 2021
మటన్ చుక్కా
కావాల్సిన పదార్థాలు :
మటన్ - 300 గ్రాములు,
నూనె లేదా నెయ్యి - 2 టీస్పూన్లు,
తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1/4 కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 టీస్పూన్,
ఉప్పు - తగినంత,
గరం మసాలా (మటన్ మసాలా) - టీస్పూన్,
కారం - తగినంత,
నీరు - 1/4 కప్పు,
పెరుగు - 2 టీస్పూన్లు.
పసుపు - తగినంత,
కరివేపాకు - రెండు రెబ్బలు,
పచ్చిమిర్చి - రెండు,
వెల్లుల్లి - ఒక రెబ్బ,
మిరియాలపొడి - 1/2 టీస్పూన్,
కొత్తిమీర తరుగు - టీస్పూన్.
తయారుచేసే విధానం :
ముందుగా మటన్‌ని శుభ్రంగా కడగాలి. దీన్ని బౌల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు వేసి బాగా కలపాలి.
మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత తగినంత నీరు పోసి కుక్కర్లో వేసి, మెత్తగా ఉడకబెట్టాలి.
పాన్ తీసుకుని నెయ్యి వేడిచేసి ఇందులో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
మిరియాల పొడి, మిగిలిన గరం మసాలా వేసి బాగా కలియతిప్పాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన మటన్‌ని వేసి సన్నని మంటపై పూర్తిగా ఫ్రై అయ్యే వరకూ ఉంచాలి.
అంతే వేడివేడి మటన్ చుక్కా రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసిన దీన్ని అన్నంలోకానీ రోటీలో కానీ తినొచ్చు
Friday, January 22, 2021
కొర్రలు, గుమ్మడి తో కేక్ | పాకశాల - Pakashala
కావాల్సిన పదార్థాలు :
కొర్రలు - 100 గ్రాములు,
గుమ్మడిపండు - 300 గ్రాములు,
పాలు - 300 మి.లీ,
మైదా - 300 గ్రాములు,
ఈస్ట్ - 4 గ్రాములు,
పంచదార - 30 గ్రాములు,
నువ్వులు - అలంకరణకు,
నెయ్యి - తగినంత.
కిస్‌మిస్,
క్రాన్ బెర్రీ ముక్కలు - గుప్పెడు,
తయారుచేసే విధానం :
కొర్రలను ఐదు గంటలసేపు నానబెట్టి వడకట్టాలి.
గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి.
చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి.
ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్ వేసి ఉండలు లేకుండా కలిపి, ప్లాస్టిక్ పేపరు కప్పి పక్కనుంచాలి.
మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి.
ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి.
తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి.
Friday, January 8, 2021
కంద అట్లు తయారు చేయడం | పాకశాల - Pakashala
కావాల్సిన పదార్థాలు:
కంద రెండు కప్పులు (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి),
శనగపప్పు అర కప్పు,
ఎండుమిర్చి నాలుగు,
జీలకర్ర టీస్పూను,
ఉప్పు, నూనె తగినంత.
తయారుచేసే విధానం:
శనగపప్పును అరగంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
కంద ముక్కలు మిక్సీలో వేసి, కొబ్బరి తురుములా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
కంద ముద్దను జల్లెడలో వేసి, నీళ్లన్నీ వడగట్టాలి. ఆ నీళ్లు పక్కనుంచుకోవాలి.
నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పులను కలిపి బరకగా రుబ్బుకోవాలి.
శనగపప్పు, కంద ముద్దలు రెండింటినీ కలుపుకోవాలి.
పెనం మీద నూనె వేసి ఈ మిశ్రమాన్ని గరిటెతో దోశ వేసుకోవాలి.
రెండోవైపు కూడా కాల్చుకున్నాక వేడిగా నెయ్యి, అన్నంతో వడ్డించాలి. ఇది అన్నంలోకి మంచి కాంబినేషన్.