రాజ్మా సూప్ తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసిన పదార్థాలు :
రాజ్మా గింజలు - ఒక కప్పు,
సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - పావు కప్పు,
పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూను,
వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను,
టమాటా పేస్ట్ - పావు కప్పు,
నూనె - 2 టీ స్పూన్లు,
ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం :
రాజ్మా గింజలను 6 గంటల పాటు నాన బెట్టండి. తర్వాత తగినన్ని నీళ్లు జతచేసి ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
ఉడికిన రాజ్మాను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చెయ్యండి. ఒక గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి పేస్టు వేసి వేగించండి.
రెండు నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ కలపండి. టమాటా పచ్చివాసన పోయాక రాజ్మాపేస్ట్, ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించండి.
సూప్ వడ్డించినప్పుడు పైన కొద్దిగా తరిగిన చీజ్ లేదా క్రీమ్ వేసి సర్వ్ చేయవచ్చు.
No comments:
Post a Comment