గోరుమీటీలు తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసినవి:
మైదా - పావుకేజీ,
బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు,
వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు,
పంచదార - 200 గ్రాములు,
బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు,
యాలకులు - రెండు,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు - కొద్దిగా.
తయారీ విధానం:
ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.
పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.
మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
No comments:
Post a Comment