కావలసినవి :
బాస్మతీ రైస్ - కప్పు, నీళ్లు - 1-1/2 కప్పు ,
స్వీట్‌కార్న్ - కప్పు,
బఠాణీలు- కప్పు,
ఉల్లిపాయ - 1,
అల్లం - ముక్క,
పచ్చిమిరప -1,
వెల్లుల్లి రెబ్బలు - 4,
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
గరం మసాలా - పావు స్పూన్,
పసుపు - చిటికెడు,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
యాలకులు- 2, ఉప్పు,
కారం - తగినంత,
నిమ్మరసం- కొద్దిగా,
పుదీనా ఆకులు - కొన్ని,
బిర్యానీ ఆకులు - 2
తయారీ :
ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసిపెట్టుకోవాలి.
కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కను వేగించాలి.
ఉల్లి పేస్ట్ వేసి దానికి కారం, పసుపు, గరం మసాలాలు కలపాలి. స్వీట్‌కార్న్, బఠాణీలు వేసి దోరగా వేగించాలి.
అందులో నానబెట్టిన రైస్ వేసి ఉడికించాలి. ఆఖరున సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు తీపి మొక్కజొన్న పలావ్ రెడీ. రైతాతో, అప్పడాల కాంబినేషన్లో ఈ పలావ్ తింటే రుచిగా ఉంటుంది
.
No comments:
Post a Comment