కావలసిన పదార్థాలు:
పనస గింజలు - 2 కప్పులు,
బియ్యప్పిండి - ఒక కప్పు,
పచ్చిమిర్చి - 4,
పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు,
ఉల్లి తరుగు - అరకప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూను,
ఉప్పు - రుచికి సరిపడా,
కొత్తిమీర తరుగు - పావుకప్పు,
అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూను,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి.
మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి.
No comments:
Post a Comment