కావలిసినవి ::
బియ్యప్పిండి - కేజీ,
బెల్లం - ముప్పావు కేజీ,
కొబ్బరి ముక్కలు - రెండు,
డాల్డా - 100గ్రాములు,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం:
బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్ వేసి పొడి చేసుకోవాలి.
వెడల్పాటి పాన్‌లో బెల్లంను వేడి చేయాలి. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి.
బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.
ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.
పాన్‌లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
No comments:
Post a Comment