recipes
recipe for buckeyes
recipes with chicken
recipe for banana bread
recipes with ground beef
recipe for lasagna
recipe for meatloaf
recipe for eggnog
recipes for christmas
recipe for chili
Tuesday, April 21, 2020
మసాలా ఆవడ తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసిన పదార్థాలు
శెనగపప్పు- అరకప్పు కందిపప్పు – అరకప్పు పెసరపప్పు – అరకప్పు మినప్పప్పు – అరకప్పు జీడిపప్పు పలుకులు – పావుకప్పు కొత్తిమీర- ఒక కట్ట పుదీనా – ఒక కట్ట పచ్చిమిర్చి – ఆరు అల్లం – చిన్న ముక్క కరివేపాకు – రెండు రెబ్బలు వంటసోడా – పావుచెంచా ఉప్పు -తగినంత నూనె వేయించేందుకు సరిపడా తాలింపు కోసం : పెరుగు – మూడు కప్పులు క్యారెట్ తురుము – పావు కప్పు పచ్చిమిర్చి – రెండు అల్లం తరుగు – చెంచా ఉప్పు – తగినంత ఆవాలు, మినప్పప్పు – చెంచా చొప్పున నూనె – చెంచా కొత్తిమీర తరుగు – చెంచా
తయారు చేయువిధానం
శెగపప్పు, మినప్పపు, కందిపప్పు, పెసరపప్పులను రెండు గంటల ముందుగా నీళ్లుపోసి నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి మెత్తగా పిండి రుబ్బాలి.
రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సెనపప్పు ముద్దపై వేయాలి. అలాగే తగినంత ఉప్పు, వంటసోడా కూడా వేసుకుని మరోసారి కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడడి చల్లారాక వేడి నీటిలో వేసి నిమిషమయ్యాక తీసేయాలి. ఈ వడల్ని ఇప్పుడు ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు కలిపిన పెరుగులో వేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు వేయించి దింపేయాలి. ఈ తాలింపు వేడి చల్లారాక పెరుగుపై వేయాలి.చివరగా క్యారెట్ తురుము, కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment