recipes recipe for buckeyes recipes with chicken recipe for banana bread recipes with ground beef recipe for lasagna recipe for meatloaf recipe for eggnog recipes for christmas recipe for chili
Friday, June 19, 2020
జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala
మైదా - 1 కప్పు,
ఒక బౌల్‌లో మైదాపిండి శనగపిండి, తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా గట్టిగా కలపాలి.
బ్రెడ్ జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు-4, పంచదార-అర కప్పు,
మంచినీళ్లు-అర కప్పు,
యాలకుల పొడి-పావు టీస్పూన్,
ఫుడ్ కలర్-చిటికెడు(ఇష్టపడితేనే),
నూనె-తగినంత.
తయారుచేయు విధానం :
బ్రెడ్ ముక్కలను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్ ఆకారంలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో పంచదార వేసి అందులో మంచినీళ్ళు పోసి దాన్ని స్టవ్‌పై పెట్టాలి.
పంచదార కరిగేవరకు గరిటెతో తిప్పుతూ అయిదు నిమిషాలపాటు మరగనివ్వాలి.
తరువాత పంచదార పాకాన్ని కిందికి దించి చల్లారాక అందులో ఫుడ్ కలర్, యాలకుల పొడి కలపాలి.
స్టవ్‌పై బాణలి ఉంచి, తగినంత నూనె పోసి, అది వేడెక్కాక అందులో గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి సన్నటి మంటపై దోరగా వేగించాలి.
వేగిన బ్రెడ్ ముక్కలను పంచదార పాకంలో వేసి, అయిదు నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.
Thursday, June 18, 2020
గోరుమీటీలు తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసినవి:
మైదా - పావుకేజీ,
బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు,
వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు,
పంచదార - 200 గ్రాములు,
బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు,
యాలకులు - రెండు,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు - కొద్దిగా.
తయారీ విధానం:
ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.
పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.
మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
Monday, June 15, 2020
స్వీట్‌కార్న్ పలావ్ తయారు చేయడం | పాకశాల - Pakashala
కావలసినవి :
బాస్మతీ రైస్ - కప్పు, నీళ్లు - 1-1/2 కప్పు ,
స్వీట్‌కార్న్ - కప్పు,
బఠాణీలు- కప్పు,
ఉల్లిపాయ - 1,
అల్లం - ముక్క,
పచ్చిమిరప -1,
వెల్లుల్లి రెబ్బలు - 4,
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
గరం మసాలా - పావు స్పూన్,
పసుపు - చిటికెడు,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
యాలకులు- 2, ఉప్పు,
కారం - తగినంత,
నిమ్మరసం- కొద్దిగా,
పుదీనా ఆకులు - కొన్ని,
బిర్యానీ ఆకులు - 2
తయారీ :
ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసిపెట్టుకోవాలి.
కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కను వేగించాలి.
ఉల్లి పేస్ట్ వేసి దానికి కారం, పసుపు, గరం మసాలాలు కలపాలి. స్వీట్‌కార్న్, బఠాణీలు వేసి దోరగా వేగించాలి.
అందులో నానబెట్టిన రైస్ వేసి ఉడికించాలి. ఆఖరున సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు తీపి మొక్కజొన్న పలావ్ రెడీ. రైతాతో, అప్పడాల కాంబినేషన్లో ఈ పలావ్ తింటే రుచిగా ఉంటుంది
.
రాజ్మా సూప్ తయారు చేయడం | పాకశాల - Pakashala
Subscribe to:
Posts (Atom)