కావాల్సిన పదార్థాలు:
నాటుకోడి -1 కేజీ
జీడిపప్పు- 100 గ్రా
నూనె-100గ్రా
పచ్చిమిర్చి -50గ్రా
టమాటాలు -1/4 కేజి
ఉల్లిపాయలు -100గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్-50 గ్రా
పసుపు-చిటికెడు
ఉప్పు-తగినంత
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి-చిటికెడు
కొత్తిమీర-2 టీ స్పూన్లు
తయారుచేసే విధానం :
- మాంసం ముక్కలకు కారం, పసుపు, ధనియాల పొడి పట్టించాలి.
- జీడి పప్పులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించి చల్లారిన తర్వాత ముద్ద చేయాలి.
- స్టౌపై ఒక మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వత టమాటా ముక్కలు, కోడి మాంసం వేసి ఉడికించాలి.
- ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి ఉడికిం చాలి.
- దించే ముందు కొత్తిమీర టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
No comments:
Post a Comment