కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన గుడ్డు- 4
- శనగపిండి-2 టేబుల్ స్పూన్లు
- చికెన్-1/4కిలో
- పసుపు-1/2 టీ స్పూను
- దాల్చిన చెక్క-అంగుళం ముక్క
- నువ్వులు-1/2 టీ స్పూను
- వాము-1/4 టీ స్పూను
- యాలకులు- 2
- గరం మసాలా-1/2 టీ స్పూను
- ఉల్లిపాయల తరుగు-1/2 కప్పు
- టమాటా -1
- నిమ్మరసం-1/2 టీ స్పూన్
- కారం-1/2 టీస్పూను
- సోంపు పొడి-1/2 టీస్పూను
- కొత్తి మీర తరుగు- 2 టీస్పూన్లు
- కరివేపాకు రెబ్బలు-4
- పచ్చిమిర్చి-2
- మెంతి పొడి-1/4 టీ స్పూను
- లవంగాలు-4
- పెరుగు-1/4 కప్పు
- నూనె-సరిపడా
- ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం:
- చికెన్ ఎండుమిర్చి, దాల్చిన చెక్క నువ్వులు, యాలకులు , వాము వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఈ మిశ్రమంలో పసుపు, శనగపిండి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల్లా కాల్చుకోవాలి.
- బాణలిలో నూనె పోసి వేడెక్కాక గుడ్డును ఈ పిండిలో ముంచి బజ్జీల్లా కాల్చుకోవాలి.
- తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి 2 నిమిషాలు వేగించాలి.
- తర్వాత టమాటాలు, మెంతి పొడి, కారం, సోంపు పొడి, వేసి ఐదు నిమిషాలు వేగించాలి.
- తర్వాత పెరుగు, గరం మసాలా , నిమ్మరసం, వేసి చిన్న మంట మీద మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
- చివరగా గుడ్డు బజ్జీలని మధ్యకి కోసి వాటిని కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
- కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి బజ్జీలని టేస్ట్ చేయండి.
No comments:
Post a Comment