Wednesday, November 28, 2018

పనీర్‌ పకోరా





కావాల్సిన పదార్ధాలు:

  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి-3
  • తురిమిన పనీర్‌-1 1/2 కప్పు
  • ఉడికించిన బంగాళా దుంప-1
  • బ్రెడ్‌ స్టైస్‌లు-8 
  • బ్రెడ్‌ ముక్కలు-1/2 కప్పు
  • కొత్తిమీర తరుగు-2 టేబుల్‌ స్పూన్లు
  • తురిమిన చీజ్‌- 3 టేబుల్‌ స్పూన్లు
  • కారం-1 టీ స్పూను
  • నూనె- సరిపడా
  • ఛాట్‌ మసాలా-1/2 టీ స్పూను
  • ఉప్పు-రుచికి తగినంత


తయారుచేసే విధానం: 



  • ఒక బౌల్‌లో బ్రెడ్‌ స్లైస్‌లు తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి ఉండల్లా తయారు చెయ్యాలి.
  • తర్వాత బ్రెడ్‌ స్లైసులను తీసుకుని చివర్లు కత్తిరించాలి. 
  • చపాతీ కర్రతో బ్రెడ్‌ స్లైసులను చపాతీల్లాగ వత్తుకోవాలి. 
  • ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌పై పెట్టి మరలా వత్తాలి. 
  • ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్రెడ్‌ స్టైసులను వత్తుకుని వీటిని ఒకదానిపై మరొకటి ఉంచాలి. 
  • వీటిని మూడు లేదా నాలుగు ముక్కలుగా కోసి లోపల ఉంచిన మిశ్రమం విడిపోకుండా ఒక టూత్‌ పిక్‌ను గుచ్చాలి. 
  • ఇప్పుడు స్టౌపై ఫ్రయింగ్‌ ప్యాన్‌ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. 
  • అందులో ముక్కలుగా కట్‌చేసి పెట్టుకున్న బ్రెడ్‌ స్లైసులను వేసి ఒక్కొక్కొటిగా వేయించుకోవాలి. 
  • ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్‌ను ఉంచి దానిపై బాగా వేయించిన బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. 
  • ఇలా చేయడం ద్వారా టిష్యూ పేపర్‌ అధికంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. 
  • అతిధులకి వడ్డించేముందు టూత్‌పిక్‌ తీసి మీకిష్టమైన చట్నీ లేదా సాస్‌తో వేడివేడి పనీర్‌ పకోరాలను సర్వ్‌ చేయండి.


No comments:

Post a Comment