కావాల్సిన పదార్థాలు:
- గుడ్లు-8
- ఉల్లిపాయల తరుగు-1/2 కప్పు
- బ్రెడ్ తురుము-1/4 కప్పు
- క్యారెట్-1
- బంగాళాదుంప-1
- టమాటాలు-2(గుండ్రంగా కోయాలి)
- కొత్తిమీర తరుగు-కొద్దిగా
- కారం-1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-3
- చెర్రీ పండ్లు-3
- గరం మసాలా -1/4 టీస్పూను
- నూనె-1 టీస్పూను
- నూనె-1 టీ స్పూను
- ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం :
- ఒక గిన్నెలో గుడ్లు బ్రెడ్ తురుము, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత ఒక బాణలికి చుట్టూ నూనె రాసి కొద్దిగా గుడ్లు మిశ్రమం పోసి పైన క్యారెట్, ఉల్లిపాయ, ఆలుగడ్డ వేయాలి. తర్వాత దాని పైన మళ్ళీ కొద్దిగా గుడ్ల మిశ్రమాన్ని పోసి దానిపైన చెర్రీలు, టమాటా ముక్కలు, కొత్తిమీర , వెల్లుల్లి రెబ్బలు పేర్చాలి.
- ఇలా పొరలు పొరలుగా వరుసగా పేర్చుకున్నాక కుక్కర్‌లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- టమాటా ముక్కలు, ఉల్లితరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
No comments:
Post a Comment