Saturday, November 24, 2018

పనీర్‌ ఎగ్‌ కర్రీ






కావాల్సిన పదార్థాలు:

  • పనీర్‌ తరుగు-1 కప్పు
  • పసుపు-1/4 టీ స్పూన్‌
  • కార్న్‌ఫ్లోర్‌-2 టేబుల్‌ స్పూన్లు
  • నూనె-వేయించడానికి సరిపడా
  • బిర్యానీ ఆకులు-2
  • దాల్చిన చెక్క-1 అంగుళం ముక్క
  • యాలకులు-2
  • లవంగాలు-3
  • జీల కర- 1 టీ స్పూన్‌
  • కారం-3 టీ స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు-1/4కప్పు
  • వెల్లుల్లి ముద్ద - 1 1/2 టేబుల్‌ స్పూన్‌
  • పసుపు-1/2 టీ స్పూన్‌
  • జీలకర్ర పొడి-1 టేబుల్‌ స్పూన్‌
  • ధనియాల పొడి-1 1/2 టీ స్పూన్‌
  • ఆమ్‌చూర్‌ పొడి- 1 టీ స్పూన్‌
  • గరం మసాలా పొడి-1/2 టేబుల్‌ స్పూన్‌


తయారుచేసే విధానం


  • పనీర్‌ తురుమును రెండు సమాన భాగాలుగా చేసు కోవాలి.
  • ఒక భాగం పనీర్‌లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని బాల్స్‌లా చేసుకోవాలి.
  • మిగిలిన సగం పనీర్‌ తురుములో కార్న్‌ ఫ్లోర్‌ వేసి చపాతీ పిండిలా కలుపుకుని ఉండల్లా చేసి మధ్యలో ఖాళీ ఉండేలా చేసుకోవాలి.
  • వీటి మధ్యలో బాల్స్‌లా చేసి పెట్టుకున్న పనీర్‌ ఉండలను పెట్టి ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెలో దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్లు నూనె వేసి వేడెక్కిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర వేసి వేగించాలి.
  • తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత ఆమ్‌ చూర్‌పొడి, పనీర్‌ వేసి ఉడికించుకోవాలి.
  • ఉడికించిన గుడ్డుని రెండు భాగాలుగా చేసి ఈ మిశ్రమంలో వేసి ఉడికించాలి.
  • చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు అన్నీ ఉడికే వరకు వుంచి తర్వాత స్టౌపై నుండి దించేయాలి.


No comments:

Post a Comment