Thursday, November 22, 2018

గుత్తొంకాయ కూర‌







కావల్సినవి : 


  • గుత్తి వంకాయలు : 1/2 కేజీ
  • ఉల్లిపాయలు : 1/4 కేజీ
  • టమోటాలు : 1/4కేజీ
  • కారం : సరిపడా
  • ధనియాలు పొడి :సరిపడా
  • ఆవాలు : 1/2 స్పూను
  • ఉప్పు : రుచికి సరిపడా
  • పసుపు : చిటికెడు
  • కొబ్బరి : 1 కప్పు
  • అల్లం : కొద్దిగా
  • నూనె : 2 స్పూన్లు
  • పచ్చిమిర్చి : 4
  • నువ్వులు : 25 గ్రా
  • కొత్తిమీర : తగినంత


తయారీ : 


  • ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  • వంకాయలకు అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి. 
  • ఇప్పుడు నువ్వులు ఒక పాన్‌ లో వేయించుకోవాలి. 
  • దోరగా వేగాక వాటిని మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలి.
  • ధనియాలు పొడి, కారం, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి అన్ని గ్రైండ్‌ చేసి వుంచుకోవాలి.
  • ఈ మసాలా ముద్దకు ఉప్పు, కొద్దిగా నూనె వేసి కట్‌ చేసి ఉంచిన వంకాయల్లో పెట్టుకొవాలి.
  • ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి.
  • నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
  • ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి.
  • ఇప్పుడు ఆ గిన్నెలో ఒక లీటరు నీరు పోసి వంకాయలు ఉడికి బాగా మగ్గనివ్వాలి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి.
  • ఇప్పుడు పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి.

No comments:

Post a Comment