Monday, March 18, 2019

బెండకాయ పెరుగు చట్నీ


బెండకాయ పెరుగు చట్నీ
కావలసిన పదార్థాలు 



బెండకాయలు - అరకిలో, 
పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, 

పెరుగు -ముప్పావు కప్పు, 
పచ్చిమిర్చి - 3, 

నూనె - వేగించడానికి సరపడా, 
ఉప్పు -రుచికి తగినంత. 

తాలింపు కోసం: కొబ్బరినూనె - అర టేబుల్ స్పూను,
 ఆవాలు - అర టీ స్పూను, 
ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు.

తయారు చేసే విధానం 

బెండకాయల్ని అంగుళం పొడవున తరిగి నూనెలో దోరగా వేగించి ఉప్పు చల్లి పక్కనుంచాలి. 
మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి తరుగును పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి, వేగించిన బెండలో కలపాలి. 
అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. తర్వాత దోరగా వేగించిన తాలింపుని బెండ మిశ్రమంలో కలపాలి. 
ఈ చట్నీ పరాటాల్లోకి బాగుంటుంది.

1 comment: