సొరకాయ పొట్టు చట్నీ
కావలసి పదార్థాలు
సొరకాయ పొట్టు- అర కప్పు,
శనగపప్పు- అర టేబుల్ స్పూన-,
మినప్పప్పు- ఒక టేబుల్ స్పూను,
ఎండుమిర్చి నాలుగు,
సన్నగా తరిగిన ఉల్లిపాయ,
టమాటా- ఒక్కటి,
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు,
కరివేపాకు, కొత్తివీుర- కొద్దిగా,
చింత పండు పులుసు- పావు కప్పు,
నూనె- ఒక టేబుల్ స్పూను,
ఉప్పు- తగినంత.
తయారు చేయు విధానం
ఒక బాణలిలో నూనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి.
తర్వాత ఎండుమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 2 ని॥లు వేగించాలి.
సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 5 ని॥ లు వేగించాలి.
తర్వాత చింతపండు పులుసు, పసుపు వేసి మరో 2 ని॥ లు ఉడికించి దించేయాలి
చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుని, పోపు పట్టుకోవాలి.
No comments:
Post a Comment