కావల్సిన పదార్థాలు:
తరిగిన పన్నీర్ - 1 కప్పు,
గట్టిపర్చిన పాలు - 1 కప్పు,
పాలు - 1 లీటరు, డ్రై ఫ్రూట్లు - కొన్ని
యాలకుల పొడి - 1 చెంచా
తయారు చేయు విధానం:
తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేసి వెంటనే పాలను జతచేయాలి.
అరగంట వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి.
గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండాలి.
యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. చివరగా డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేసి, బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించి చల్లారిక అందరికీ వడ్డించాలి
No comments:
Post a Comment