కావలసిన పదార్థాలు
కాప్సికం - ఒకటి,
పెరుగు - 2 కప్పులు, '
నూనె - ఒక టీ స్పూన్,
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - ఒకటి,
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 3 టేబుల్ స్పూన్లు,
సన్నగా తరిగిన టమాటా ముక్కలు - 3 టేబుల్ సూన్లు,
మినప్పప్పు - ఒక టీ స్పూను,
ఆవాలు, జీలకర్ర, మెంతులు - కొద్దిగా,
కరివేపాకు - 4 రెబ్బలు,
ఉప్పు - సరిపడా,
కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం
ఒక పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు తిరగమోత వెయ్యండి.
దీనిలో తరిగిన పచ్చిమిర్చి, కాప్సికం ముక్కలని వేసి అవి సగం వేగిన తర్వాత స్టవ్ ఆపెయ్యండి.
ఈ మిశ్రమం చల్లారిన తరువాత, దీనిలో ఉల్లి, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపండి.
ఆపైన దీనిలో గిలకొట్టిన పెరుగు కలిపితే కాప్సికం పెరుగు పచ్చడి రెడీ. మీ రుచిని బట్టి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.
దీనిని ఏదైనా రైస్తో లేదా రోటీతో మాత్రమే కాకుండా, ఒక సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు.
కాప్సికంని పూర్తిగా ఉడికించక పోవడం మూలాన దీనిలో ఉన్న విటమిన్ ‘సి’ అంతా మనకు అందుతుంది.
No comments:
Post a Comment