Sunday, March 17, 2019

రస్‌మలై స్వీట్ (రాజ్ భోగ్ స్వీట్ ) తయారు చేయు విధానం



కావల్సిన పదార్థాలు: 

పాలవిరుగు:- 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది)
పచ్చికోవా - 3 టేబుల్ స్పూన్లు; 

పిస్తాపప్పులు - 15; 
మైదా - టీ స్పూను; 

పంచదార - 5 కప్పులు; 
కుంకుమపువ్వు - అర టీ స్పూను; 

రోజ్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు; 
యాలకుల పొడి - అర టీ స్పూన్.

తయారు చేయు విధానం:

తయారు చేయు విధానంః ముందుగా పాలవిరుగును (విరిగిన పాలు) మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. 
దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి. 
ఇప్పుడు పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి. 
తర్వాత పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి.
ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి. 
తయారుచేసి ఉంచుకున్న స్టఫ్డ్ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి.
అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి. 
అంతే రాజ్ భోగ్ స్వీట్  రెడీ.

No comments:

Post a Comment