Saturday, March 16, 2019

అటుకుల బర్ఫీ తయారు చేయు విధానం


కావల్సిన పదార్థాలు: 

అటుకులు - కప్పు, 
చక్కెర - కప్పు, 

కోవా - కప్పు, 
యాలుకులపొడి - చెంచా, 

గోరువెచ్చని పాలు - పావుకప్పు, 
నెయ్యి పావు కప్పు, 
బాదంపలుకులు కొన్ని.


తయారు చేయు విధానం:

అటుకుల్ని ఐదు నిమిషాలు నీళ్లలో నానబెట్టి.. తరవాత గట్టిగా పిండి మిక్సీ జారులో వేసుకోవాలి. వాటిని మెత్తని ముద్దలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిని కరిగించి కోవా వేయాలి.

అది కొద్దిగా వేగాక చక్కెర, అటుకుల ముద్దా, యాలకులపొడీ, పాలూ పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి ఇది దగ్గరకు అవుతుంది.

అప్పుడు దింపేసి.. నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకుని నచ్చిన ఆకృతిలో ముక్కల్లా కోస్తే చాలు. పైన బాదం పలుకులు అలంకరించి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే చాలు. అటుకుల బర్ఫీ రెడీ.

No comments:

Post a Comment