Thursday, October 4, 2018

పొట్లకాయ పెరుగు పచ్చడి





కావాల్సిన పదార్థాలు:

పొట్లకాయ ముక్కలు -3 కప్పులు
పెరుగు -1 కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -3
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కరివేపాకు - 5 రెబ్బలు
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి ముక్కలు-1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తరుగు -1కప్పు

తయారుచేసే విధానం:


  • ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక స్పూన్‌ నూనె, కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టాలి. 
  • ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 
  • పొట్లకాయ ముక్కలు చల్లారాక వాటిని పెరుగు మిశ్రమంలో కలపాలి. 
  • ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. 
  • కొద్దిగా చల్లారాక పెరుగు పచ్చడి మిశ్రమంలో పోపును కూడా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. 
  • పెరుగు పచ్చడి అన్నంతో పాటు తింటే రుచిగా ఉంటుంది

No comments:

Post a Comment