కావలసినవి
- పాలపొడి: ఒకటిన్నర కప్పులు
- పంచదార: నాలుగు కప్పులు
- మైదాపిండి: అరకప్పు
- నెయ్యి: ఒకటిన్నర కప్పులు
- ఉప్పు: రుచికోసం చిటికెడు
తయారుచేసే విధానం
పంచదారలో సుమారు ఓ కప్పు నీళ్లు పోసి మరిగించాలి.
తరవాత సిమ్‌లో పెట్టి 20 నిమిషాలపాటు తీగపాకం వచ్చేవరకూ తిప్పుతూ ఉడికించాలి.
విడిగా ఓ గిన్నెలో మైదా, ఉప్పు, పాలపొడి, టేబుల్‌స్పూను నెయ్యి వేసి కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి మళ్లీ సిమ్‌లో నాలుగు నిమిషాలు ఉడికించాలి.
తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి ఉండలు కట్టకుండా ఉడికించాలి.
మిశ్రమ అంచులకు అంటుకోకుండా ఉండేవరకూ ఉడికించి దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి ఆరాక ముక్కలుగా కోయాలి.
No comments:
Post a Comment