కావలిసిన పదార్ధాలు
అరటి పళ్ళు-3
కొకో పొడి-1/4 కప్పు
ఆల్మండ్ బటర్ పేస్ట్-4 టేబుల్ స్పూన్లు
వేయించిన వేరుశనగలు-10
ఉప్పు-చిటికెడు
చాక్లెట్ బార్/చిప్స్-4
లరాబార్ ముక్కలు-2
తయారుచేసే విధానం:
- బాగా పండిన అరటి పండ్ల గుజ్జు తీసి కాసేపు ఫ్రీజర్‌లో వుంచాలి.
- మిక్సీ జార్‌లో కోకో పౌడర్, వేరుశెనగ గింజల పొడి, ఆల్మండ్ బటర్ పేస్టు, ఉప్పు, చాక్లెట్ చిప్స్, లరా బార్ బైట్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
- అందులో కొద్దిగా పాలను చేర్చి మరోసారి బ్లెండ్ చేయాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసి మూతపెట్టి ఫ్రిజర్‌లో వుంచాలి. రెండుగంటల తర్వాత బైటికి తీసి సర్వింగ్ బౌల్స్‌లో ఐస్‌క్రీమ్‌ని వుంచి బాదం తరుగు, చాక్లెట్ చిప్స్‌తో గార్నిష్ చేస్తే అరటి ఆల్మండ్ ఐస్ క్రీమ్ రెడీ!
No comments:
Post a Comment