కావాల్సిన పదార్థాలు:
టమాటా ముక్కలు- 2 కప్పులు
కీరదోస-3
ఉల్లిపాయ-1
క్యాప్సికం-1
కొత్తిమీర తరుగు-పావుకప్పు
క్యారెట్లు-4
బేసిల్ పేస్ట్/ కొత్తిమీర పేస్ట్-1/4 కప్పు
పాలకూర-1 కట్ట
ఆలివ్ నూనె-2 టేబుల్ స్పూన్లు
కూరగాయలు ఉడికించిన నీళ్ళు-1/2 కప్పు
ఉప్పు-రుచికి తగినంత
మిరియాల పొడి-చిటికెడు
టమాటా పేస్టు-4 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
- ముందుగా ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీరలని సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టౌపై ఒక మందపాటి పాత్ర వుంచి ఆలివ్ నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి వేయించుకోవాలి.
- అవి కాస్త మగ్గాక కీరదోస ముక్కలు, పాలకూర ఆకులు కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- పాలకూర కొద్దిగా మెత్తగా అయ్యాక టమాటా ముక్కలు, టమాటా పేస్టు, కూరగాయలు ఉడికించిన నీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి.
- కూరముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరియాలపొడి వేసి మరో పదిహేను నిమిషాలు మరిగించాలి.
- చివరగా బేసిల్ పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాలు వుంచి దింపేస్తే పసందైన సూప్ రెడీ!
No comments:
Post a Comment