కావాల్సిన పదార్థాలు:
చికెన్ వింగ్స్-పావుకిలో
నిమ్మరసం-1 టీస్పూన్
బత్తాయి రసం-మూడు టేబుల్ స్పూన్లు
సోయా సాస్ -2 టీ స్పూన్లు
నూనె -1/2 టేబుల్ స్పూన్
చెక్కర -2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు-2
ఉల్లికాడల తరుగు-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- చిటికెడు
తయారుచేసే విధానం:
ముందు రోజు రాత్రే నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసి బంగారు రంగు వచ్చే దాకా వేయించుకోవాలి.
వాటిపై ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసుకుంటే చికెన్ వింగ్స్ రెడీ!
No comments:
Post a Comment