Saturday, October 13, 2018

గోధుమరవ్వ కోవాకేస‌రి






కావల్సినవి:

గోధుమ రవ్వ- గ్లాసు
నెయ్యి- అరకప్పు
బెల్లం తరుగు- గ్లాసు
జీడిపప్పు - పది
యాలకుల పొడి-అరచెంచా
కోవా- పావుకప్పు
పాలు- గ్లాసు

తయారీ:

బాణలిలో సగం నెయ్యి వేడిచేసి గోధుమరవ్వను వేయించుకుని తీసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో బెల్లం తీసుకుని అది కరిగేలా నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టాలి. 
బెల్లం కరిగి పాకం రానివ్వాలి.
ఇంతలో మరో గిన్నెలో గోధుమరవ్వ, పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. 
రవ్వ ఉడికించి పాలు ఇంకిపోయాక దాన్ని బెల్లంపాకంలో వేసి కలపాలి. 
తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కేసరి అవుతుంది అప్పుడు దింపేయాలి.

No comments:

Post a Comment